ఎక్కడివారక్కడే ఉండండి ప్లీజ్: జగన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ఏప్రిల్ 14 దాకా ఎక్కడివారక్కడే ఉండాలని ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభ్యర్థించారు. ఇళ్లలో ఉండే 80.9 శాతం మేరకు కరోనా ఎదుర్కోవచ్చన్నారు. రాష్ట్రంలో వైద్య, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారని కీర్తించారు. ప్రజలు వారందరి కష్టాన్ని గుర్తించాలని కోరారు. ఏపీలో కరోనా, లాక్‌డౌన్‌ల పరిస్థితిపై సమీక్ష అనంతరం గురువారం సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. [&hellip;]</p>

ఎక్కడివారక్కడే ఉండండి ప్లీజ్: జగన్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ఏప్రిల్ 14 దాకా ఎక్కడివారక్కడే ఉండాలని ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభ్యర్థించారు. ఇళ్లలో ఉండే 80.9 శాతం మేరకు కరోనా ఎదుర్కోవచ్చన్నారు. రాష్ట్రంలో వైద్య, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారని కీర్తించారు. ప్రజలు వారందరి కష్టాన్ని గుర్తించాలని కోరారు. ఏపీలో కరోనా, లాక్‌డౌన్‌ల పరిస్థితిపై సమీక్ష అనంతరం గురువారం సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 10 కరోనా పాజిటివ్ కేసులే ఉండడం రాష్ట్రం అదృష్టం అనుకోవాలన్నారు. లాక్‌డౌన్ అందరూ కచ్చితంగా పాటించాలని, భోజన వసతులు కావాల్సిన వాళ్లు 1902 నెంబర్‌కు కాల్ చేస్తే సహాయమందిస్తామని తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఏమొచ్చినా 104 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్ఎమ్‌లు, హెల్త్ అసిస్టెంట్లు, డాక్టర్లు ఎల్లప్పుడుూ అందుబాటులో ఉంటారన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు కావాల్సినన్ని అందుబాటులో ఉన్నాయని, ప్రజలు భయాందోళనలకు గురై ఎక్కువగా కొనిపెట్టుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రజల సంఖ్యను బట్టి ప్రతి 2 కిలో మీటర్లకు ఒక రైతుబజార్ ఏర్పాటు చేసి, దానిలో కావాల్సినన్ని కూరగాయలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఏప్రిల్ 4న రాష్ట్రంలో పేదలకు ఉచితంగా రేషన్, 1000 రూపాయల నగదు, ఒక కేజీ కందిపప్పు అందిస్తామని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఫారెన్ నుంచి ఏపీకి 27వేల 819 మంది వచ్చారన్నారు. వీరందరినీ ట్రాక్ చేయడమే కాక నిఘా పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో 4 చోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటళ్లు, ప్రతి జిల్లాలో 200 పడకల హాస్పిటల్, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి క్వారంటైన్ కోసం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిలో 213 వెంటిలేటర్లు సిద్ధం చేశామన్నారు. కరోనా వచ్చినవాళ్లలో 14 శాతం మందికి మాత్రమే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం వస్తుందని, 4.8 శాతం మందికికి మాత్రమే ఐసీయూకు వెళ్లాల్సి వస్తుందని జగన్ అన్నారు. ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ కంట్రోల్ రూమ్, స్టేట్‌లో సీఎంవో, అధికారులు, కలెక్టర్లతో కలిపి స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామాలలో రైతులు, రైతు కూలీలు పొలం పనులు చేయక తప్పదు గనుక పనిచేసేటపుడు వ్యక్తుల మధ్య దూరం పాటించాలని జగన్ కోరారు. గ్రామాల్లో పారిశుధ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖను ఆదేశించినట్లు సీఎం తెలిపారు.

కేసీఆర్ సానుకూలంగా స్పందించారు..

హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ ప్రజల విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడామని, ఆయన సానుకూలంగా స్పందించారని జగన్ తెలిపారు. కేసీఆర్ గారు ఎంతో ఆప్యాయత చూపారన్నారు. అందరినీ తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

tags : jagan press meet, lockdown ap, jagan press on coronavirus awareness

Next Story