- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ పాలనపై ‘రాపాక’ ప్రశంసల జల్లు
by Vemula.Srinu Prasad |
<p>జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇవాళ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ,జగన్ పరిపాలన బాగుందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్ధిస్తున్నానని చెప్పారు. వైజాగ్ రాజధాని అయితే వెనుకబడిన జిల్లాలు అన్నీ అభివృద్ధి చెందుతాయని తెలిపారు. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ఈ మధ్య కాలంలో కలువలేదనీ, తనకు పార్టీ నుంచి పిలుపు కూడా లేదని స్పష్టం చేశారు. తాను పార్టీకి దూరంగా […]</p>

X
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇవాళ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ,జగన్ పరిపాలన బాగుందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్ధిస్తున్నానని చెప్పారు. వైజాగ్ రాజధాని అయితే వెనుకబడిన జిల్లాలు అన్నీ అభివృద్ధి చెందుతాయని తెలిపారు. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ఈ మధ్య కాలంలో కలువలేదనీ, తనకు పార్టీ నుంచి పిలుపు కూడా లేదని స్పష్టం చేశారు. తాను పార్టీకి దూరంగా లేననీ, దగ్గరగా కూడా లేనని కానీ, జనసేన పార్టీ ఎమ్మెల్యే గానే కొనసాగుతున్నానని తెలిపారు.
Next Story






