‘వాట్ ఏ క్యాచ్..ఏక్‌బార్ వాచ్’

by  |
‘వాట్ ఏ క్యాచ్..ఏక్‌బార్ వాచ్’
X

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తుది జట్టులో ఉంటే జట్టుకు అదనపు బలం కాగలడని‌ గతంలో చాలా సార్లు నిరూపించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో విఫలమైనా..ఫీల్డింగ్‌తోనైనా మాయ చేయగలడు. తాజాగా న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న రెండో టెస్టులోనూ మరోసారి తన ఫీల్డింగ్ స్కిల్స్‌తో మెస్మరైజ్ చేసి..అద్భుతమైన క్యాచ్‌లు అందుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 72వ ఓవర్ చివరి బంతిని మహ్మద్ షమీ షార్ట్ పిచ్‌ లెంగ్త్‌లో వేశాడు. దీంతో అవతల బ్యాటింగ్ చేస్తున్న వాగ్నర్ భారీ షాట్ ఆడాడు. అయితే ఆ బంతి రవీంద్ర జడేజా తలపై నుంచి చాలా ఎత్తులో వెళ్తుండగా.. జడేజా ఒక మీటర్ ఎత్తుకు ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. బ్యాట్స్‌మన్ వాగ్నర్‌ కూడా ఆ క్యాచ్ పట్టిన తీరు చూసి ఆశ్చర్యంతో కొద్ది సేపు క్రీజులోనే ఉండిపోయాడు. సహచర క్రికెటర్లు, స్టేడియంలోని అభిమానులకు కూడా కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు. జడేజా అందుకున్న అద్భుతమైన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో జడేజా రెండు కీలకమైన వికెట్లు కూడా తీశాడు.



Next Story

Most Viewed