జాక్వెలిన్ కోసం ప్రత్యేక విమానం.. కేవలం 6 రోజులకు రూ.5 కోట్లు ఖర్చు..!

by  |
jacqualine
X

దిశ, సినిమా : శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న ‘విక్రాంత్ రోణ’లో పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. ఇందులో తన పాత్ర సుదీప్‌తో ఈక్వల్ ఇంపార్టెన్స్ కలిగి ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది. ఆరు రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్న తనను ప్రత్యేక విమానంలో షూటింగ్‌కు తీసుకొచ్చారని తెలుస్తోంది.

తనపై స్పెషల్ సాంగ్, సీన్స్ కోసం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టారట నిర్మాతలు. ఈ పాట కోసం భారీ సెట్ వేయగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న సాంగ్‌లో 300 మంది సైడ్ డ్యాన్సర్స్ కనిపించనున్నారట. జాక్వెలిన్ పాత్ర ప్రేక్షకులకు సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని, సినిమాకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషమని చెప్తున్నారు మేకర్స్.


Next Story