ఈ నెల 13న సిద్ధిపేటలో ఐటీసీ కంపనీ జాబ్ మేళా

by  |
job-fair 1
X

దిశ, సిద్దిపేట: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో ఈ నెల 13న ఐటీసీ కంపనీ జాబ్ మేళా నిర్వహింపబడునని, ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం పరిధిలోని ఆయా మండల, గ్రామాల నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పిలుపునిచ్చారు. డైరెక్టర్, ఉపాధి శిక్షణ శాఖ వారి ఆధ్వర్యంలో ఐటీసీ కంపనీ నిర్వహించే జాబ్ మేళాలో ఐటీఐ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ రోజున సిద్ధిపేట విపంచి కళా నిలయంలో ఉదయం 9.30 గంటలకు ఇంటర్వూలు నిర్వహించబడుతాయని మంత్రి పేర్కొన్నారు.

నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలు, గ్రామ ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని అభ్యర్థులను గుర్తించి వారి బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరయ్యేలా చూడాలని కోరారు. ఈ మేరకు ఐటీఐలో ఫిట్టర్, టర్నర్, ఎలాక్ట్రీషియన్, మిషినిస్టు, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ పూర్తి చేసిన 25 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. మరిన్ని వివరాలకు సిద్ధిపేట ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్-కన్వీనర్ వీవీ.సుబ్బలక్ష్మిని సంప్రదించాలని సూచించారు.


Next Story

Most Viewed