- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇటలీలో లాక్ డౌన్ పొడిగింపు!
by B.Srinivas |
<p>రోమ్: ఇటలీ.. లాక్ డౌన్ ను మరో 10 రోజులు పొడిగించనుంది. ఆ దేశంలో 3 వారాలుగా లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ శుక్రవారం నాటికి లాక్ డౌన్ గడువు ముగుస్తుండగా… దాన్ని ఏప్రిల్ 12వ తేదీ వరకు పొడిగించేందుకు నిర్ణయించినట్టు ఇటలీ హెల్త్ మినిస్టర్ రాబర్ట్ స్పెరాంజ తెలిపారు. నేషనల్ సైంటిఫిక్ టెక్నికల్ కమిటీ చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న ఇటలీలో […]</p>

X
రోమ్: ఇటలీ.. లాక్ డౌన్ ను మరో 10 రోజులు పొడిగించనుంది. ఆ దేశంలో 3 వారాలుగా లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ శుక్రవారం నాటికి లాక్ డౌన్ గడువు ముగుస్తుండగా… దాన్ని ఏప్రిల్ 12వ తేదీ వరకు పొడిగించేందుకు నిర్ణయించినట్టు ఇటలీ హెల్త్ మినిస్టర్ రాబర్ట్ స్పెరాంజ తెలిపారు. నేషనల్ సైంటిఫిక్ టెక్నికల్ కమిటీ చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న ఇటలీలో సోమవారం(1,648)… క్రితం రోజు(3,815) కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ మృతుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. సోమవారం ఒక్కరోజే 812 మంది చనిపోయారు. అక్కడ కరోనా కేసులు లక్ష దాటాయి. కరోనా మరణాలు 11,600ను మించాయి. ఆ దేశంలో వైద్య సేవలు అందిస్తున్న 61 మంది వైద్యులు చనిపోయినట్టు డాక్టర్ల అసోసియేషన్ తెలిపింది.
Tags: Coronavirus, italy, lockdown, extension
Next Story






