చినుకు పడింది.. ఖరీఫ్‌కు సిద్ధమైన రైతన్న…

by  |
చినుకు పడింది.. ఖరీఫ్‌కు సిద్ధమైన రైతన్న…
X

దిశ,ఉట్నూర్ : వకాలానికి నాంది పలికే మృగశిర కార్తె ప్రారంభం అవడంతో శనివారం నుండి మండలంలోని పలు ప్రాంతాలలో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. రోహిణి కార్తెలో కురిసిన వర్షాలకు పత్తి కంది సోయా పెసర పంటలను సాగు చేయడం ఆనవాయితీగా ఉంది. ఆ తర్వాత జూన్ లో వచ్చే మృగశిర కార్తె వర్షానికి సూచికగ రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈనెల మొదటి వారంలో భారీ వర్షం కురవడంతో వాళ్ల కుల దేవతలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి వర్షాకాలంలో ఆరోగ్యాలు బాగుండాలని ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని కోరుకుంటూ మొక్కుకున్నారు. ఈ ఏడాది రైతులు ఎంతో సంతోషంగా ఖరీఫ్ పనులు ప్రారంభిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈనెల 15 నుంచి రైతుబంధు సాయం అందిస్తామని ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకు ప్రభుత్వం సాయం ఎంతో ఉపయోగపడుతుందని ఏజెన్సీ ప్రాంతాలలో వర్షాధార పంటల పైన ఎక్కువ రైతులు ఆధారపడుతున్నారు.

కొన్ని సంవత్సరాలుగా అతివృష్టితో అనావృష్టితో రైతులు అనుకున్నంత దిగుబడి రాక అప్పులు పాలు కాగా ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే అనుకూలంగా పడడంతో ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. దుక్కులను చదును చేసే పనిలో రైతులు కూలీలు నిమగ్నమయ్యారు. వరుణుడి కరుణతో వ్యవసాయ పనుల్లో పుంజుకుంది రైతులు కాడే ట్లను కట్టి దుక్కి ని తునిచే లకల్లో మొదలైన పనులు విత్తనాలు వేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అయ్యారు.


Next Story

Most Viewed