బిగ్‌బాస్‌లో సుమ ఎంట్రీ నిజమేనా?

by  |
బిగ్‌బాస్‌లో సుమ ఎంట్రీ నిజమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్ 4.. రానురాను బోరింగ్‌గా తయారయిందని ప్రేక్షకులు ఫీల్ అవుతుండగా.. ఏదో ఓ గిమ్మిక్కుతో బూస్టప్ ఇచ్చేందుకు షో నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గతవారం చార్మింగ్ బ్యూటీ సమంతను వన్ డే హోస్ట్‌గా తీసుకు రాగా, శనివారం లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనతో వర్చువల్ కన్వర్జేషన్ నడిపించారు. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేందుకు ఇలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తుండగా, ఇంకా 5 వారాల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ హౌజ్‌లోకి ‘బుల్లితెర క్వీన్ సుమ’ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఓ ప్రోమో రీలీజ్ చేశారు. మరి అందులో వాస్తవమెంత? సుమ చివరిదాకా కొనసాగుతుందా?

ప్రముఖ యాంకర్ సుమ కనకాల బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. కరోనా మహమ్మారి చాలా మార్పులు తీసుకొచ్చిందని, అందుకే బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లబోతున్నట్లు వెల్లడించింది సుమ. మామూలుగానే తన పంచ్‌ల టైమింగ్‌తో ప్రేక్షకులను కితకితలు పెట్టే ఈ స్టార్ యాంకర్.. వచ్చీ రాగానే ఇంటి సభ్యులు ఒక్కొక్కరినీ ఇమిటేట్ చేసి నవ్వించింది. అయితే జస్ట్ 3 నిమిషాల ప్రోమోలోనే ముప్పై పంచులేసిన సుమ.. ఇక హౌజ్‌లోకి వస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. సుమ కూడా అదే విషయాన్ని తన స్టైల్లో చెప్పింది. ‘ఇది ఓ చిన్న ప్రోమో మాత్రమే.. పిక్చర్ అబీ బాకీ హై’ అని చెప్పడంతో నాగార్జున కూడా నెక్ట్స్ 5 వారాలు నాకు కూడా వాచిపోతుందని చెప్పకనే చెప్పాడు. సుమ ఎంట్రీ ఇస్తే.. ఫుల్ ఫన్ ఉంటుందని ప్రేక్షకుల కూడా భావిస్తున్నారు. ఇక ప్రోమో చివరలో నాగ్.. సుమను లోపలికి పంపిస్తున్నట్లు కూడా చూపించారు. మరి బయట ఎప్పుడూ ఏదో ఒక ఈవెంట్‌తో బిజీబిజీగా ఉండే సుమ నిజంగానే బిగ్‌బాస్‌లోకి వెళ్లనుందా? లేక షోలో భాగంగా ఇదొక ఎత్తుగడనా? సుమ పాపులారిటీని బిగ్ బాస్ టీమ్ వాడుకోవాలనుకుంటుందా? అంటే బోర్‌ ఫీలింగ్‌లో ఉన్న ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపేందుకు షో నిర్వాహకులు ట్రై చేస్తున్నారని తెలుస్తోంది.

మూడో సీజన్‌లో యాంకర్ ప్రదీప్‌ను ఇలానే తీసుకొచ్చారు. కానీ హౌజ్‌మేట్స్‌తో ఒక్కరోజు మాత్రమే గడిపిన ప్రదీప్.. బయటకు వచ్చేశాడు. ఇప్పుడు సుమ విషయంలోనూ బిగ్ బాస్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడా? లేదా సుమను నిజంగానే వైల్డ్ కార్డు ఎంట్రీతో కొనసాగిస్తారా? మరి ఈ ఐదు వారాలు సుమ హౌజ్‌లో కొనసాగితే, తనకు టైటిల్ గెలిచే అవకాశాలుంటాయా? ఈ సందేహాలన్నీ తీరిపోవాలంటే.. మరొక్క రోజు ఓపిక పట్టాల్సిందే.



Next Story