అభిమానులను పిచ్చోళ్లను చేసిన రాయ్ లక్ష్మి!

by  |
అభిమానులను పిచ్చోళ్లను చేసిన రాయ్ లక్ష్మి!
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఎండింగ్ వరకు చదవకపోతే ఖచ్చితంగా పప్పులో కాలేస్తాం. ఈ మధ్య లక్ష్మీ రాయ్ పెళ్లని వార్తలు వస్తున్నాయని, అందుకే దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ఈ నోట్ షేర్ చేస్తున్నానని తెలిపిన భామ.. తన పార్ట్‌నర్ ప్రైవసీ దెబ్బతినకూడదనే తమ రిలేషన్ గురించి ఓపెన్ కాలేదని తెలిపింది. లాస్ట్ వీక్ ఎంగేజ్మెంట్ అయిందని.. ఇప్పటికే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్స్‌కు మ్యారేజ్ ఇన్విటేషన్ కూడా పంపామని చెప్పింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఇచ్చింది. ఈ పోస్ట్‌ను మరొకరి దగ్గర చోరీ చేశానని.. చేతులు శుభ్రం చేసుకోవాలని, శానిటైజర్ తప్పనిసరిగా వినియోగించాలని రిమైండ్ చేసేందుకే ఇలా చేశానని తెలిపింది రాయ్.

Next Story