- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ.. టీడీపీకి భారీ షాక్?
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశముంది. టీడీపీకి బిగ్ షాక్ తగలనుంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే బుచ్చయ్య చౌదరి కొనసాగుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ వెంటే ఇప్పటివరకు బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఎంతోమంది నేతలు టీడీపీ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశముంది. టీడీపీకి బిగ్ షాక్ తగలనుంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే బుచ్చయ్య చౌదరి కొనసాగుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ వెంటే ఇప్పటివరకు బుచ్చయ్య చౌదరి ఉన్నారు.
ఎంతోమంది నేతలు టీడీపీ నుంచి వెళ్లిపోయినా.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీతోనే ఉన్నారు. టీడీపీలో మోస్ట్ సీనియర్ లీడర్ బచ్చయ్య చౌదరి అని చెబుతూ ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించిన సమయంలో ఆ పార్టీలో చేరిన బుచ్చయ్య చౌదరి.. అప్పటినుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు అందరికీ సుపరిచితమే. అయితే పార్టీపైన అసంతృప్తితోనే ఆయన ఇప్పుడు రాజీనామా చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.






