బరోడా వివాదం పరిష్కరించండి : ఇర్ఫాన్

by  |
బరోడా వివాదం పరిష్కరించండి : ఇర్ఫాన్
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి తర్వాత దేశంలో తొలి సారి క్రికెట్ మ్యాచ్‌లు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ద్వారా ప్రారంభమ్యాయి. అయితే ఈ టోర్నీ కంటే ముందే బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యా, వైస్ కెప్టెన్ దీపక్ హుడా మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం కారణంగా హుడా జట్టును కూడా వదిలేసి వెళ్లిపోయాడు. తాజాగా ఈ వివాదంపై బరోడా జట్టు మాజీ కెప్టెన్, టీమ్ ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఆటగాళ్ల మధ్య ఇలాంటి వివాదాలు వాళ్ల కెరీర్‌కు మంచివి కావన్నాడు.

‘తమ ఆటగాళ్లు స్వేచ్ఛగా, సురక్షితంగా ఆడే వాతావరణాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ సృష్టించాలి. హుడా ఈ జట్టు మాజీ కెప్టెన్ కాబట్టి ఎంతో మంది యువ క్రికెటర్లను అతడు నడిపించగలడు. అతడి అవసరం జట్టుకు ఎంతో ఉన్నది. అలాంటిది బీసీఏ అధికారులు ఎందుకు అలసత్యం వహిస్తున్నారో అర్ధం కావడం లేదు. వెంటనే వీరి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించాలి’ అని ఇర్ఫాన్ అన్నాడు. మంచి ప్రదర్శన చూపించే ఆటగాళ్లపై బరోడా అసోసియేషన్ దృష్టి సారించి మద్దతు పలకాలని ఇర్ఫాన్ చెప్పాడు.


Next Story