- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్ సంచలన నిర్ణయం!
by Chukka Sudharani |
<p>కరోనా వైరస్ బారినపడిన టాప్-3 దేశాల్లో ఒకటైన ఇరాన్, సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇరాన్‌లో మృతుల సంఖ్య 237కు పెరిగింది. వైరస్ బాధితుల సంఖ్య 7 వేలను దాటిన వేళ, జైళ్లలో ఉన్న నేరస్తులను విడుదల చేయాలని నిర్ణయించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రకాల నేరాలు చేసి శిక్షను అనుభవిస్తున్న దాదాపు 70 వేల మందిని విడుదల చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసీ వెల్లడించారు. ఖైదీల విడుదలపై ఇరాన్ […]</p>
X
కరోనా వైరస్ బారినపడిన టాప్-3 దేశాల్లో ఒకటైన ఇరాన్, సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇరాన్‌లో మృతుల సంఖ్య 237కు పెరిగింది. వైరస్ బాధితుల సంఖ్య 7 వేలను దాటిన వేళ, జైళ్లలో ఉన్న నేరస్తులను విడుదల చేయాలని నిర్ణయించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రకాల నేరాలు చేసి శిక్షను అనుభవిస్తున్న దాదాపు 70 వేల మందిని విడుదల చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసీ వెల్లడించారు. ఖైదీల విడుదలపై ఇరాన్ పత్రికలు, వెబ్ సైట్లలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయంతో సమాజంలో అభద్రతా భావం కలుగబోదని ఇబ్రహీం రైసీ వ్యాఖ్యానించడం గమనార్హం.
Tags: iran, corona, criminals, released
Next Story






