- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌లను ఏకిపారేసిన సెహ్వాగ్.. హాలిడే కోసమే ఐపీఎల్ ఆడతారంటూ ఆగ్రహం
ఐపీఎల్-18లో మ్యాక్స్‌వెల్(పంజాబ్ కింగ్స్), లివింగ్‌స్టోన్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఫామ్ లేమితో తంటాలు పడుతున్నారు.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో మ్యాక్స్‌వెల్(పంజాబ్ కింగ్స్), లివింగ్‌స్టోన్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఫామ్ లేమితో తంటాలు పడుతున్నారు. పేలవ ప్రదర్శన చేస్తున్న వారిపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. పరుగులు చేయాలనే ఆకలి, ఉద్దేశం వారికి లేదన్నాడు. హాలిడే కోసం భారత్‌కు వచ్చినట్టు వారి తీరు ఉందని విమర్శించాడు. ‘మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌లలో ఆకలి తీరిందని అనుకుంటున్నా. వారు హాలిడే కోసం మాత్రం ఇక్కడికి వచ్చారు. సరదాగా గడిపారు. తిరిగి వెళ్లిపోతారు. జట్టు కోసం పోరాడాలనే తప్ప వారిలో కనిపించడం లేదు.’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్‌కు ఆడుతున్న మ్యాక్స్‌వెల్ ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 41 రన్సే చేశాడు. మరోవైపు, లివింగ్‌స్టోన్ బెంగళూరు తరపున 7 మ్యాచ్‌ల్లో 87 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆర్సీబీ, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌లను తుది జట్ల నుంచి తప్పించాయి.






