- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Suresh Raina: ఐపీఎల్-2025 ట్రోఫీ ఆ జట్టుదే.. సురేష్ రైనా సెన్సేషనల్ స్టేట్‌మెంట్
పది రోజుల పాటు వాయిదా పడిన ఐపీఎల్-2025 (IPL-2025) తిరిగి ఇవాళ కేకేఆర్ (KKR), ఆర్సీబీ (RCB) మ్యాచ్‌తో రీస్టార్ట్ కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పది రోజుల పాటు వాయిదా పడిన ఐపీఎల్-2025 (IPL-2025) తిరిగి ఇవాళ కేకేఆర్ (KKR), ఆర్సీబీ (RCB) మ్యాచ్‌తో రీస్టార్ట్ కాబోతోంది. ఈ క్రమంలోనే భారత మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా (Suresh Raina) సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru)నని తేల్చి చెప్పాడు. ఈ సీజన్ మొత్తంలో ఆర్సీబీ మెరుగైన ఆటతీరును కనబరిచిందని అన్నాడు. టోర్నీ మధ్యలో గ్యాప్ రావడం బెంగళూరు కలిసొచ్చిందని.. ప్లేఆఫ్స్‌కు మానసికంగా సన్నద్ధమయ్యేందుకు ఆటగాళ్లకు టైమ్ దొరికిందని పేర్కొన్నాడు.
చిన్నస్వామి లాంటి చిన్న స్టేడియంలో స్వల్ప టార్గెట్లను ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌల్ చేసి కాపాడారని కొనియాడారు. ఈ సీజన్ మొత్తం ఆ జట్టులో బౌలర్లే అధిపత్యం ప్రదర్శించారని తెలిపాడు. రజత్ పటీదార్ (Rajat Patidar) కెప్టెన్సీ అత్యదర్భుతంగా ఉందని కొనియాడాడు. చెన్నై లాంటి జట్టును వాళ్ల సొంత గడ్డపై ఓడించడం మాములు విషయం కాదని అన్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్లు కూడా బాగా ఆడుతున్నాయని తెలిపాడు. ఏది ఏమైనా ఈసారి ఐపీఎల్-2025 ట్రోఫీని ఎత్తేది ఆర్సీబీనే అని సురేష్ రైనా తేల్చి చెప్పాడు.






