తిట్టాడు.. డిన్నర్‌కు తీసుకెళ్లాడు.. శ్రేయర్ అయ్యర్‌పై శశాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Harish |

ఐపీఎల్-18 ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో పంజాబ్ కింగ్స్ పరాజయం పాలైన విషయం తెలిసిందే.

తిట్టాడు.. డిన్నర్‌కు తీసుకెళ్లాడు.. శ్రేయర్ అయ్యర్‌పై శశాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18 ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో పంజాబ్ కింగ్స్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. లీగ్ దశలో అద్భుతమైన ప్రదర్శన చేసిన పంజాబ్ ఫైనల్‌లో మాత్రం బోల్తాపడింది. అంతకుముందు క్వాలిఫయర్-2లో ముంబై‌పై గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో శశాంక్ అనవసర పరుగు ప్రయత్నించి రనౌట్ అవడం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కోపం తెప్పించింది. మ్యాచ్ అనంతరం శశాంక్‌పై అయ్యర్ సీరియస్ అయ్యాడు. దీనిపై తాజాగా శశాంక్ స్పందించిస్తూ.. ఆ మ్యాచ్‌లో ఘోర తప్పిదం చేశానని అంగీకరించాడు. అలా చేసినందుకు అయ్యర్ తనను చెంపదెబ్బ కొట్టాల్సిందినని చెప్పాడు. ‘ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో శ్రేయస్ అయ్యర్‌ను మించిన కెప్టెన్ లేడు. ప్లేయర్లకు స్వేచ్ఛ ఇస్తాడు. అందరినీ సమానంగా చూస్తాడు. అతను ఆటిట్యూడ్ చూపిస్తాడని ఎవరూ అనరు. అందరితో సరదాగా ఉంటాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు సరైన సలహా ఇస్తే స్వీకరిస్తాడు. ముంబైతో మ్యాచ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించి తప్పు చేశా. అందుకు అయ్యర్ నన్ను చెంపదెబ్బ కొట్టాల్సింది. మా నాన్న కూడా కోపడ్డారు. ఫైనల్ వరకు మాట్లాడలేదు. నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదని అయ్యర్ అన్నాడు. కానీ, తర్వాత అతను నన్ను డిన్నర్‌‌కు తీసుకెళ్లాడు.’అని శశాంక్ చెప్పుకొచ్చాడు.

Next Story