శ్రేయస్ అయ్యర్‌కు భారీ ఫైన్ వేసి బీసీసీఐ.. ఎందుకో తెలుసా?

by Harish |   (  Updated:2025-05-01 17:16:22  IST  )

ఐపీఎల్-18లో భాగంగా చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

శ్రేయస్ అయ్యర్‌కు భారీ ఫైన్ వేసి బీసీసీఐ.. ఎందుకో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో భాగంగా చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎస్కేపై గెలుపొందిన ఆనందంలో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించారు. చెన్నయ్ ఇన్నింగ్స్‌లో పంజాబ్ బౌలర్లు నిర్ణీత సమయంలోగా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయారు. ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం కనీస ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించినట్టు అవుతుంది. దీంతో అయ్యర్‌కు రూ.12 లక్షలు ఫైన్ వేసినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ మ్యాచ్‌లో చాహల్ స్పిన్ మాయకుతో శ్రేయస్ అయ్యర్(72), ప్రభ్‌సిమ్రాన్(54) రాణించడంతో పంజాబ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం పంజాబ్ 13 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

Next Story