- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ తర్వాత రోహిత్‌కు సర్జరీ? 2027 వరల్డ్ కప్ ఆడాలంటే తప్పనిసరి!
ఐపీఎల్ తర్వాత రోహిత్ శర్మ సర్జరీ చేయించుకోనున్నాడట. 2027 వరల్డ్ కప్ ఆడాలంటే తప్పనిసరి అని విశ్లేషకులు చెప్తున్నారు.

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ సర్జరీ చేయించుకోనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రోహిత్ చాలాకాలంగా కుడి హ్యాంస్ట్రింగ్ సమస్యతో బాధపడుతున్నాడట. కానీ టీమిండియా సారధ్య బాధ్యతల వల్ల అతని షెడ్యూల్ పూర్తిగా బిజీగా ఉండటంతో సర్జరీని వాయిదా వేస్తూ వచ్చాడు. గతేడాది టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్.. కొన్నిరోజుల క్రితమే టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతని షెడ్యూల్‌లో ఖాళీ వచ్చింది. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ తర్వాత మళ్లీ రోహిత్ ఆడేది అక్టోబరులో ఆస్ట్రేలియాతోనే. మధ్యలో ఇంత గ్యాప్ ఉండటంతో ఐపీఎల్ ముగిసిన వెంటనే సర్జరీ చేయించుకోవాలని రోహిత్ అనుకుంటున్నాడట.
2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే రోహిత్ ఈ సర్జరీ చేయించుకొని, ఫిట్‌గా తయారవడం చాలా ముఖ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో 2016 నవంబరులో క్వాడ్రిసిప్స్ సర్జరీ చేయించుకున్న రోహిత్ పూర్తిగా కోలుకోవడానికి మూడు నెలలు పట్టింది. మళ్లీ అంత గ్యాప్ దొరకదనే ఆలోచనతోనే ఈ సర్జరీని హిట్‌మ్యాన్ వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పుడు తీరిక దొరకడంతో సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నాడు.






