- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: ఐపీఎల్ ప్లేఆఫ్స్ మిస్ అవనున్న స్టార్.. ఆర్సీబీకి కష్టమే!
ఆర్సీబీ స్టార్ ప్లేయర్‌ను ఐర్లాండ్ టూర్‌కు పంపాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. అయితే ఈ మ్యాచులు సరిగ్గా ఐపీఎల్ ప్లేఆఫ్స్ టైంలోనే ఉండటం గమనార్హం.

దిశ, స్పోర్ట్స్: చెన్నైపై ఆర్సీబీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన విండీస్ వీరుడు రొమేరియో షెఫర్డ్.. ఐపీఎల్ (IPL 2025) ప్లేఆఫ్స్ ఆడటం అనుమానంగా మారింది. ఈ నెల 21 నుంచి ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు వెళ్లే వెస్టిండీస్ జట్టులో షెఫర్డ్ కూడా ఉన్నాడు. విండీస్ బోర్డు ప్రకటించిన జట్టుకు షాయి హోప్ సారధ్యం వహించనున్నాడు. ఈ జట్టు మే 21 నుంచి 25 వరకు ఐర్లాండ్‌తో మూడు వన్డేలు, ఆ తర్వాత మే 29 నుంచి జూన్ 3 వరకు ఇంగ్లండ్‌తో మరో మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఐపీఎల్ (IPL 2025) ప్లేఆఫ్స్ కూడా మే 20 నుంచి 25 వరకే జరగనున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయం చేసుకున్న ఆర్సీబీకి షెఫర్డ్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమనే చెప్పాలి.
విండీస్ జట్టు: షాయి హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, కీసీ కార్తీ, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, ఆమిర్ జంగూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోతీ, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, జేడెన్ సీల్స్, రొమేరియో షెఫర్డ్.






