- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిష్టి తగలకూడదని.. కారు మొత్తం నిమ్మకాయ, మిరపకాయలతో నింపేశాడు!
ఐపీఎల్ 2025 ఫైనల్‌కు ఆర్సీబీ చేరింది. ఈ క్రమంలో జట్టుకు దిష్టి తగలకూడదని తన కారు మొత్తం నిమ్మకాయ, మిరపకాయలతో నింపేశాడో ఫ్యాన్.

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2025 ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది రకరకాల పూజలు చేస్తున్నారు. ఇప్పుడే తాజాగా ఒక ఫ్యాన్.. ఆర్సీబీ టీంకు దిష్టి తగలకూడదని, తన కారు మొత్తాన్ని నిమ్మకాయ, మిరపకాయలతో నింపేశాడు. కారుపై వీటినా దండలు దండలుగా కట్టి ఆర్సీబీకి దిష్టి తగలకుండా ఇలా చేశానని చెప్తున్నాడు. ‘యాంటీ-దిష్టి స్క్వాడ్’ అని ఆ కారుపై రాసుకొని తిరుగుతున్నాడీ హార్డ్ కోర్ ఆర్సీబీ ఫ్యాన్. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలే మరో ఫ్యాన్.. ఆర్సీబీ కనుక కప్పు కొడితే కర్ణాటకలో పబ్లిక్ హాలీడే ప్రకటించాలంటూ సీఎం సిద్దరామయ్యకు లెటర్ రాసిన సంగతి తెలిసిందే.
కాగా, ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఉన్న ఆర్సీబీ జట్టు.. ఇప్పటికి మూడుసార్లు ఫైనల్ చేరింది. కానీ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. చివరగా 2016లో కచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుందనుకుంటే.. చివరకు సన్‌రైజర్స్ చేతిలో పరాజయం చవిచూసి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి జట్టంతా అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఎలాగైనా కప్పు కొట్టాలని ప్రయత్నిస్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ సారి కప్పు తమ టీందే అని గట్టిగా నమ్ముతున్నారు.






