- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL: ఫైనల్‌లో అదరగొట్టిన RCB బ్యాటర్లు.. పంజాబ్ ఎదుట భారీ టార్గెట్
ఐపీఎల్(IPL 2025) ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) బ్యాటర్లు అదరగొట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్(IPL 2025) ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) బ్యాటర్లు అదరగొట్టారు. ఫైనల్ మ్యాచ్ అనే టెన్షన్ ఒక్కరిలోనూ కనిపించలేదు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు దంచికొట్టారు. ఓవరాల్‌గా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేశారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (16), విరాట్ కోహ్లీ(43), మయాంక్ అగర్వాల్ (24), కెప్టెన్ రజాత్ పాటిదర్(26), లివింగ్ స్టోన్ (25), జితేశ్ శర్మ (24), షెఫార్డ్ (17) పరుగులతో రాణించారు. పంజాబ్(Punjab Kings) జట్టు విజయం సాధించాలంటే 191 పరుగులు చేయాల్సి ఉంది. ఇక పంజాబ్ బౌలర్లలో జెమిసన్ మూడు వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు, అజ్మతుల్లా ఒమర్ జాయ్, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న వారు అవుతారు. దీంతో విజేత ఎవరు అవుతారా? అని క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.






