- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: టాస్ గెలిచిన రాజస్థాన్
ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్(Jaipur) వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్(Jaipur) వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో ముందుగా గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేయబోతున్నది. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచులు ఆడిన రాజస్థాన్ ఏడు మ్యాచుల్లో ఓటమి చవి చూసింది. కేవలం రెండు మ్యాచుల్లో గెలిచింది. దాదాపు రాజస్థాన్ ఇంటిబాట పట్టిందనడంలో సందేహం లేదు. ఇక ఇప్పటివరకు ఎనిమిది మ్యాచులు ఆడిన గుజరాత్.. రెండింట్లో ఓడి.. ఆరు మ్యాచుల్లో గెలిచింది.
Rajasthan: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, ఆకాష్ మధ్వల్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే/శుభమ్ దూబే.
Gujarat: శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.






