- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025: కాసేపట్లో ఫైనల్ ఫైట్.. టాస్ గెలిచిన పంజాబ్
ఐపీఎల్‌లో తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ మైదానం(Narendra Modi Stadium) ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ చేయబోతోంది. ఇరు జట్లూ సమఉజ్జీలుగా ఉన్న నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందనే అంశం క్రీడాభిమానులందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటు పంజాబ్ కింగ్స్, అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకోలేదు. అందుకే వీటిలో ఏ జట్టు గెలిచినా నూతన ఛాంపియన్‌గా అవతరించినట్లే అని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్‌రాబిన్, టిమ్‌రాబిల్ట్‌లెస్, డేవిడ్ సిఫెర్త్‌లెస్ నువాన్ తుషార, మోహిత్ రాథీ, స్వస్తిక్ చికారా, అభినందన్ సింగ్.
పంజాబ్: జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ షెర్‌బేర్, హర్‌ప్రీత్ షెర్‌బేర్, బార్ట్లెట్, విష్ణు వినోద్, యశ్ ఠాకూర్, ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, మిచెల్ ఓవెన్, హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్, పైలా అవినాష్.






