టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

by velandi.Saikiran |   (  Updated:2025-05-18 10:00:52  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య

టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జైపూర్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ చేయాల్సి వస్తోంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో మొదట బ్యాటింగ్ తీసుకున్న జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.


ఇరు జట్లు

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్(w/c), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వల్, ఫజల్‌హాక్ ఫరూఖ్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మిచెల్ ఓవెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

Next Story