- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL: గుజరాత్‌పై ముంబై ఘన విజయం
ఐపీఎల్‌లో గుజరాత్‌పై ముంబై ఘన విజయం సాధించింది..

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్‌లో గుజరాత్‌పై ముంబై ఘన విజయం సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గుజరాత్‌పై ముంబై గెలుపొందింది. తొలుత బాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 228 పరుగులు చేసింది. టార్గెట్ చేధనలో 20 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఆదివారం జరిగే క్వాలిఫియర్-2లో పంజాబ్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
స్కోర్లు: ముంబై-228/5, గుజరాత్-208/6
ముంబై బ్యాటింగ్: రోహిత్ 81, బెయిర్ స్టో 47,తిలక్ వర్మ 25, హార్ధిక్ పాండ్యా22, నమన్‌ధిర్ 9
గుజరాత్ బౌలింగ్: ప్రసిధ్, సాయి కిషోర్‌కు రెండేసి వికెట్లు, సిరాజ్ ఒక వికెట్
గుజరాత్ బ్యాటింగ్: సాయి సుదర్శన్ 80, వాషింగ్టన్ సుందర్ 48, షెర్ఫనె రూథర్ ఫోర్డ్ 24, కుశాల్ మెండీస్ 20, తివారి 16 నాటౌట్, షారుక్ ఖాన్ 13
ముంబై బౌలింగ్: ట్రెంట్ బోల్ట్ 2, బుమ్రా, రిచార్డ్ గ్లీసన్, మైఖేల్ సాట్నర్, నమన్‌ధీర్‌కు తలో వికెట్






