రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన MS ధోనీ.. ఏమన్నారంటే?

by Gantepaka Srikanth |

రిటైర్మెంట్ వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ MS ధోనీ(Dhoni) స్పందించారు.

రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన MS ధోనీ.. ఏమన్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: రిటైర్మెంట్ వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ MS ధోనీ(Dhoni) స్పందించారు. గుజరాత్‌తో మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడారు. రిటైర్మెంట్ విషయంలో నాకు కంగారు లేదు. నాకు ఇంకా 4-5 నెలల సమయం ఉంది. రాబోయే రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటాను. ప్రదర్శన ఆధారంగా ప్లేయర్స్ రిటైర్ అవ్వాలంటే.. ప్రతి ఆటగాడు 22 ఏళ్లకే రిటైరవ్వాలి. వచ్చే సీజన్‌కు తిరిగి వస్తానని చెప్పలేను.. రానని చెప్పలేను. తీరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా' అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఇవాళ గుజరాత్‌తో అహ్మదాబాద్(Ahmedabad) మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings).. ఘన విజయం సాధించింది. విక్టరీతో టోర్నీకి ముగింపు పలికింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans)కు షాకిస్తూ 83 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. బ్యాటర్లలందరూ రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది.

Next Story