- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్సీబీతో మ్యాచ్ వర్షార్పణం.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు
తొమ్మిది రోజుల అనంతరం IPL-2025 పున: ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తొమ్మిది రోజుల తరువాత ఇవాళ IPL-2025 పున:ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య ఇవాళ రాత్రి 7:30 మొదలు కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. ఈ పరిణామంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరై ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన KKR జట్టు 5 మ్యాచ్‌లలో విజయం సాధించి 11 పాయింట్లతో ఉంది. ప్రస్తుతం మ్యాచ్ రద్దు అవ్వడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇక చివరిదైన లీగ్ మ్యాచ్‌లో ఒకవేళ KKR గెలిచినా 13 పాయింట్లే రానుండటంతో పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలవడం సాధ్యం కాని విషయం. మరోవైపు 11 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 16 పాయింట్లతో నిలిచి ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసుకు మరింత చేరువైంది. చివరి రెండు లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు ఏ ఒక్కటి గెలిచినా.. ఒకవేళ రెండింట్లో ఓడినా ఆర్సీబీకి ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమే.






