IPL2025: హైదరాబాద్‌ హ్యాట్రిక్ ఓటమి.. KKR ఘన విజయం

by Gantepaka Srikanth |

ఈడెన్స్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా సన్‌ రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైజర్స్(Kolkata Knight Riders) జట్టు ఘన విజయం సాధించింది.

IPL2025: హైదరాబాద్‌ హ్యాట్రిక్ ఓటమి.. KKR ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈడెన్స్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా సన్‌ రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైజర్స్(Kolkata Knight Riders) జట్టు ఘన విజయం సాధించింది. 80 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా టాస్ ఓడి కేకేఆర్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు డికాక్(1), సునీల్ నరైన్(7) నిరాశ పరిచారు. ఆ తర్వాత వచ్చిన రహానే(38), రఘువంశీ(50), వెంకటేశ్ అయ్యర్(60), రింకూ సింగ్(31) అదరగొట్టారు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ షమీ, కమిన్స్, అన్సారీ, హర్షల్ పటేల్, మెండీస్ తలో వికెట్ వికెట్ తీశారు.

201 పరుగులను ఛేదించేందుకు వచ్చిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లంతా నిరాశ పరిచారు. క్లాసెన్(33), మెండీస్(27) తప్పా మిగిలిన ప్లేయర్లు.. ఓపెనర్లు హెడ్(4), అభిషేక్(2)తో పాటు కిషన్(2), నితీష్ కుమార్ రెడ్డి(19), అనికేత్(6), కమిన్స్(14) విఫలం అయ్యారు. మొత్తంగా 16.3 ఓవర్లలో 120 పరుగులు చేసి కుప్పకూలారు. కేకేఆర్ బౌలర్లో.. అరోరా, వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లు తీయగా, రస్సెల్ రెండు వికెట్లు, నరైన్, రాణా తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌తో వరుసగా మూడో ఓటమిని హైదరాబాద్ జట్టు తమ ఖాతాలో వేసుకున్నది.

Next Story