- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెలరేగిన ప్రియాన్ష్, ప్రభ్సిమ్రాన్.. కేకేఆర్ ముందు భారీ టార్గెట్ పెట్టిన పంజాబ్
కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్ పెట్టింది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య మరోసారి చెలరేగాడు. 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదిన అతను 69 రన్స్ చేశాడు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కూడా రెచ్చిపోయాడు. 49 బంతుల్లో 83 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్స్‌లు ఉన్నాయి. ఓపెనర్లే తొలి వికెట్‌కు 120 రన్స్ జత చేశారు. వీరిద్దరి తర్వాత మ్యాక్స్‌వెల్(7), జాన్సెన్(3) నిరాశపరిచారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(25 నాటౌట్), జోష్ ఇంగ్లిస్(11 నాటౌట్) విలువైన రన్స్ జోడించడంతో స్కోరు 200 దాటింది. కోల్‌కతా ముందు పంజాబ్ 202 పరుగుల లక్ష్యం పెట్టింది. ఈ నెల 15న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై కోల్‌కతా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఓటమికి పంజాబ్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నది.మరి, 202 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంటుందా? లేదా? చూడాలి.






