- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: కేకేఆర్, చెన్నై మధ్య కీలక మ్యాచ్.. టాస్ గెలిచింది ఎవరంటే..?
ఐపీఎల్ 2025 కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ రేసుకొసం పాయింట్ల పట్టికలో టాప్ 7 లో ఉన్న జట్ల మధ్య పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు కేకేఆర్, చెన్నై మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ రేసుకొసం పాయింట్ల పట్టికలో టాప్ 7 లో ఉన్న జట్ల మధ్య పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు కేకేఆర్, చెన్నై మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచులో విజయం సాధించడం కేకేఆర్ జట్టుకు అత్యంత కీలకంగా మారింది. అలాగే వరుసగా నాలుగు ఓటములతో ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి.. పరువును కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా జట్టులోకి యువ ప్లేయర్లను తీసుకుంది. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా కొనసాగనుంది. కాగా ఈ మ్యాచులోకి యువ హిట్టర్ ఉర్విల్ పటేల్ ను చెన్నై తుది జట్టులోకి తీసుకుంది. అలాగే రవిచంద్రన్ అశ్విన్, కాంబోజ్, లకు చోటు దక్కింది. కేకేఆర్ జట్టు తుది జట్టులో స్వల్ప మార్పు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మనీష్ పండేను తిరిగి జట్టులో తీసుకుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: రహ్మానుల్లా గుర్బాజ్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే(c), అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI: ఆయుష్ మ్హత్రే, ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, రవిచంద్రన్ అశ్విన్, MS ధోని(w/c), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా






