- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్సీబీకి భారీ గుడ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ తిరిగొచ్చాడు
ఐపీఎల్-18లో ప్లే ఆఫ్స్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుడ్ న్యూస్.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో ప్లే ఆఫ్స్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే చివరి గ్రూపు మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండనున్నాడు. భుజానికి గాయం కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. ఏప్రిల్ 27 నుంచి జట్టుకు అందుబాటులో లేడు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నెలకొనడంతో టోర్నీ వాయిదా పడిన సమయంలో హేజిల్‌వుడ్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అక్కడే గాయం నుంచి కోలుకున్నాడు. అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో అతని రాకపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ, హేజిల్‌వుడ్ తిరిగి ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపాడు. ఇండియాకు తిరిగొచ్చాడు. హేజిల్‌వుడ్ రాకతో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ పటిష్టంగా మారింది. ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన అతను 18 వికెట్లు తీశాడు. ఆర్సీబీ తరపున అతనే టాప్ వికెట్ టేకర్ కావడం గమనార్హం.






