మిగతా ఐపీఎల్ 2025 మ్యాచులకు ఇంగ్లండ్ స్టార్లు దూరం!

by Phanindra |

మిగతా ఐపీఎల్ 2025 మ్యాచులకు ఇంగ్లండ్ స్టార్లు దూరమయ్యారు. ముగ్గురు కీలక స్టార్లు తాము రాలేమని ఫ్రాంచైజీలకు చెప్పేశారట.

మిగతా ఐపీఎల్ 2025 మ్యాచులకు ఇంగ్లండ్ స్టార్లు దూరం!
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొందరు విదేశీ ప్లేయర్లు తమ ఫ్రాంచైజీలకు మొండిచెయ్యి చూపారు. ముఖ్యంగా ఇంగ్లండ్ ప్లేయర్లు జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, శామ్ కర్రాన్ అయితే ఐపీఎల్ 2025 మిగతా మ్యాచులు తాము ఆడలేమని ఆయా ఫ్రాంచైజీలకు చెప్పేశారట. వీరిలో రాజస్థాన్‌కు ఆర్చర్ ఆడుతుంటే.. కర్రాన్, ఓవర్టాన్ ఇద్దరూ చెన్నయ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసులో లేనందున కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిదని ఈ ప్లేయర్లు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్చర్‌కు చిన్నగాయం కూడా అయిందని రాజస్థాన్ చెప్తోంది. అయితే బట్లర్, లివింగ్‌స్టోన్, విల్ జాక్స్, జాకబ్ బెథెల్ వంటి ప్లేయర్లు మాత్రం మిగతా ఐపీఎల్‌ను పూర్తిచేసేందుకు భారత్‌కు వస్తున్నారట.

Next Story