- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rohit Sharma: అందుకే రోహిత్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా పంపుతున్నాం.. నిజం చెప్పిన జయవర్దనే
ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మను కేవలం ‘ఇంపాక్ట్ ప్లేయర్’గానే ఎందుకు ఆడిస్తున్నారో ఆ టీం హెడ్ కోచ్ బయటపెట్టాడు.

దిశ, స్పోర్ట్స్ డెస్క్: స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను ఈ ఏడాది ముంబై ఇండియన్స్ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గానే ఉపయోగించుకుంటోంది. అతన్ని కేవలం బ్యాటింగ్ సమయంలోనే ఆడిస్తోంది. ఫీల్డింగ్ సమయంలో వేరే ప్లేయర్లను తీసుకుంటోంది. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియక ఫ్యాన్స్ రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. వీటన్నింటికీ ముంబై హెడ్ కోచ్ మహేల్ జయవర్దనే ఫుల్‌స్టాప్ పెట్టేశాడు.
రోహిత్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఆడించాలనే నిర్ణయం సీజన్ ఆరంభంలో తీసుకోలేదన్నాడు. ‘మా జట్టులో చాలామంది ప్లేయర్లు డబుల్ రోల్స్ చేస్తున్నారు. దాదాపు అందరూ బౌలింగ్ చేస్తున్నారు. అలాగే కొన్ని మైదానాల్లో బౌండరీ వద్ద వేగంగా పరిగెత్తే వాళ్లు అవసరం. ఇవన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని జయవర్దనే వివరించాడు.
‘ఆరంభంలో రోహిత్ కొన్ని మ్యాచుల్లో ఫీల్డింగ్ కూడా చేశాడు. కానీ అతనికి ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో చిన్న గాయమైంది. అది సీరియస్ అవ్వకూడదనే ఆలోచనతోనే తనను ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపుతున్నాం. తనతో బ్యాటింగ్ చేయిస్తూనే గాయం పెద్దది కాకుండా మేనేజ్ చేస్తున్నాం’ అని అసలు విషయం బయటపెట్టాడు. అయితే ముంబై విజయాల్లో రోహిత్ చాలా కీలక పాత్ర పోషించాడని, మైదానంలో లేకపోయినా డగౌట్ నుంచే విలువైన సలహాలు, సూచనలు అందిస్తున్నాడని జయవర్దనే వెల్లడించాడు.






