- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > మా వాళ్లు ఒంటి కాలుతోనైనా ఆడతారు.. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్ధనే కీలక వ్యాఖ్యలు
మా వాళ్లు ఒంటి కాలుతోనైనా ఆడతారు.. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్ధనే కీలక వ్యాఖ్యలు
by Harish |
ఐపీఎల్-18లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు.

X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. తొడకండరాలు పట్టేయడంతో మధ్యలోనే మైదానం వీడాడు. దీంతో అతను క్వాలిఫయర్ 2 ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. సూర్య గాయంపై ముంబై హెడ్ కోచ్ మహేల జయవర్దనే స్పందించాడు. సూర్య ఫిట్‌గానే ఉన్నాడని, అతని గాయం అంత పెద్దది కాదన్నాడు. ఒక్క కాలుతోనైనా అతను క్వాలిఫయర్-2 ఆడతాడని చెప్పాడు. ‘మాకు కఠినమైన షెడ్యూల్ ఉందని తెలుసు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారనుకుంటున్నా. చిన్న గాయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫిజియోలు కూడా ఏం చెప్పలేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మా కుర్రాళ్లు ఒంటి కాలుతో కూడా ఆడగలరు’అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. ఆదివారం క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్‌తో ముంబై తలపడనుంది.
Next Story






