- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మ్యాచ్‌ల సంఖ్య
ఐపీఎల్ విస్తరణపై లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ విస్తరణపై లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు. 2028లో జరిగే సీజన్లో 94 మ్యాచ్‌లు నిర్వహించడానికి బీసీసీఐ సీరియస్‌గా ప్రయత్నిస్తుందని తెలిపారు. 2022 సీజన్ నుంచి 74 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ సీజన్లో 84 మ్యాచ్‌లకు పెంచాలని ప్రణాళికలు జరిగాయి. అయితే, అంతర్జాతీయ క్యాలెండర్, ఎక్కువ సంఖ్యలో డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండటంపై బ్రాడ్కాస్టర్ల ఆందోళన నేపథ్యంలో అది సాధ్యం కాలేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ..ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య కచ్చితంగా పెరిగే అవకావశం ఉందన్నాడు. ‘బీసీసీఐలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఐసీసీతో కూడా చర్చిస్తున్నాం. ఫ్రాంచైజీ క్రికెట్, టీ20 క్రికెట్, దైపాక్షిక, ఐసీసీ ఈవెంట్లపై అభిమానుల ఆసక్తి ఎలా మారుతుందో అనే దానిపై మేము సీరియస్‌గా మాట్లాడుకోవాల్సి ఉంది.’ అని తెలిపారు.
అలాగే, 94 మ్యాచ్‌లు నిర్వహించడం ద్వారా ప్రతి జట్టు ఇతర జట్లతో సొంతగడ్డపై, బయట ఆడొచ్చని, ఇది సమతుల్య పోటీని నిర్మిస్తుందని చెప్పారు. అందుకోసం ఐపీఎల్‌కు భారీ విండో అవసరమవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్ 9 వారాల విండో. 94 మ్యాచ్‌లకు పెంచేతే 11 వారాలకు విస్తరించే అవకాశం ఉంటుంది. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రొగ్రామ్‌లో 2027 వరకు ఐపీఎల్ విండో ఖరారైంది. కాబట్టి, తదుపరి మీడియా రైట్స్ ప్రారంభమయ్యే 2028లో మ్యాచ్‌ల సంఖ్య పెరిగే చాన్స్ ఉంది.






