- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ రీస్టార్ట్.. విదేశీ ప్లేయర్లు వస్తారా?లేదా?.. ఆ దేశాల ఆటగాళ్లు డౌటే
ఐపీఎల్-2025 శనివారం నుంచి పున:ప్రారంభంకానుంది.

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్-2025 శనివారం నుంచి రీస్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. వాయిదా కారణంగా ఐపీఎల్ 9 రోజులు ఆలస్యంగా ముగియనుంది. జూన్ 3న ఫైనల్ జరగనుంది. టోర్నీ వాయిదాపడటంతో చాలా మంది విదేశీ ఆటగాళ్లు తమ సొంత దేశానికి వెళ్లారు. ఇప్పుడు వారిలో కొందరు తిరిగి ఐపీఎల్‌లో పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ ప్లేయర్లు వస్తారా?లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. వచ్చే నెల 11 నుంచి 15 వరకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగనుంది. అలాగే, ఈ నెలాకరులో ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు విదేశీ ప్లేయర్లు ఐపీఎల్‌కు దూరంకానున్నారు. భారత టీ20 లీగ్‌లో పాల్గొనలా?లేదా అన్న నిర్ణయం క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకే వదిలేసింది. మరోవైపు, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం తమ ప్లేయర్లను పంపించడం కుదరదని తేల్చిచెప్పింది. ఈ ప్రభావం పలు జట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది.
టాప్-4 జట్ల పరిస్థితి ఇది
గుజరాత్ టైటాన్స్‌కు జోస్ బట్లర్(ఇంగ్లాండ్), కగిసో రబాడ(సౌతాఫ్రికా) లీగ్ దశకు అందుబాటులో ఉండనున్నారు. అయితే, బట్లర్ ప్లే ఆఫ్స్‌కు దూరమవడం గుజరాత్‌కు భారీ షాకే. గుజరాత్ దాదాపుకు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్టే. బట్లర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 11 మ్యాచ్‌ల్లో 500 రన్స్ చేశాడు. కాబట్టి, ప్లే ఆఫ్స్‌కు బట్లర్ దూరమవడం ఆ జట్టు విజయవకాశాలపై ప్రభావం చూపనుంది. వీరిద్దరూ దూరమైతే గుజరాత్‌కు భారీ దెబ్బే. మరోవైపు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్లు హేజల్‌వుడ్(ఆస్ట్రేలియా), లుంగి ఎంగిడి(సౌతాఫ్రికా) దూరం కానున్నారు. ఆర్సీబీ విజయాల్లో హేజల్‌వుడ్ పాత్ర కీలకం. 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన అతను పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. హేజల్‌వుడ్ దూరమైతే ఆర్సీబీ బౌలింగ్ దళం బలహీనంగా మారుతుంది. అయితే, ఇంగ్లాండ్ ప్లేయర్లు ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్ గురువారం జట్టులో చేరినట్టు ఫ్రాంచైజీ తెలిపింది. షెఫెర్డ్(విండీస్)కూడా వస్తాడని పేర్కొంది. ఇక, పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టు విదేశీ ప్లేయర్లు వస్తారా?లేదా? అన్నది సందిగ్ధం నెలకొంది. ఆస్ట్రేలియా ప్లేయర్లు మార్కస్ స్టోయినిస్, ఆరోన్ హార్డీ, మార్కూ జాన్సెన్(సౌతాఫ్రికా), జోష్ ఇంగ్లిస్(ఇంగ్లాండ్)లు పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ముంబై ఇండియన్స్ ప్లేయర్లందరూ అందుబాటులో ఉండనున్నారు. అయితే, ఇంటర్నేషనల్ కమిట్‌మెంట్స్ కారణంగా విల్ జాక్స్, కార్బిన్ బోష్ ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండటం డౌటే.
ఢిల్లీకి షాక్.. కోల్‌కతాలో మెజార్టీ ప్లేయర్లు అందుబాటులోకి..
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అందుబాటులో ఉండట లేదు. ఈ విషయాన్ని అతన్ని మేనేజర్ ఇటీవల తెలిపాడు. మరో ఆసిస్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ కూడా దూరమయ్యాడు. అతన్ని స్థానంలో ఢిల్లీ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌తో ఒప్పందం చేసుకుంది. అతనికి బంగ్లాదేశ్ బోర్డు ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంది. స్టార్క్ దూరమవడంతో రెహ్మాన్‌కు ఢిల్లీ పేస్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు దాదాపుగా తిరిగే వచ్చే అవకాశం ఉండటం ఆ జట్టుకు గుడ్ న్యూస్. రస్సెల్, సునీల్ నరైన్, డికాక్, గుర్బాజ్ ఇప్పటికే క్యాంప్‌లో చేరారు. మొయిన్ అలీ, రొవ్‌మన్ పొవెల్ మాత్రం ఇంకా రాలేదు. వారి రాకపై అనుమానం ఉంది. అయితే, వారు మెడికల్ రీజన్ వల్ల రాలేదని ఫ్రాంచైజీ తెలిపింది. ప్లే ఆఫ్స్ రేసులో ఊగిసలాడుతున్న ఢిల్లీ, కోల్‌కతా జట్లకు విదేశీ ప్లేయర్లు దూరం కావడం భారీ దెబ్బే.
హైదరాబాద్, చెన్నయ్, రాజస్థాన్ జట్లలో వారు డౌటే
సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నయ్ సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మిగతా మ్యాచ్‌లలో నెగ్గి ఊరట పొందాలని భావిస్తున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్, బ్యాటర్ ట్రావిస్ హెడ్ తిరిగి వచ్చేందుకు అంగీకారం తెలిపారు. అయితే, సౌతాఫ్రికాకు చెందిన క్లాసెన్, వియాన్ ముల్డర్, శ్రీలంక ప్లేయర్లు ఈషాన్ మలింక, కామిందు మెండిస్‌లు పాల్గొనడం డౌటే. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టులోని ఇంగ్లాండ్ ప్లేయర్లు సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్ ఐపీఎల్‌కు దూరం కానున్నారు. రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్)పై కూడా క్లారిటీ లేదు. నూర్ అహ్మద్, డెవాల్డ్ బ్రేవిస్, పతిరణ, డెవాన్ కాన్వే తిరిగి రానున్నారు. మిగతా రెండు మ్యాచ్‌లకు రాజస్థాన్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్(ఇంగ్లాండ్), మహీశ్ తీక్షణ(శ్రీలంక) గాయం కారణంగా దూరమయ్యారు.
- Tags
- IPL 2025






