- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?.. విజేతకు ఎంత దక్కుతుందంటే?
ఈ సీజన్‌లో ఐపీఎల్ టైటిల్ గెలిచే జట్టుకు ప్రైజ్‌మనీ ఎంత దక్కుతుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

దిశ, స్పోర్ట్స్ : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ టైటిల్ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఇప్పటివరకు బెంగళూరు, పంజాబ్ ఒక్కసారి కూడా ఐపీఎల్ విజేతగా నిలువలేకపోయాయి. దీంతో ఇరు జట్లు తొలి టైటిల్‌పై కన్నేశాయి. అయితే, ఈ సీజన్‌లో టైటిల్ గెలిచే జట్టుకు ప్రైజ్‌మనీ ఎంత దక్కుతుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
2008లో జరిగిన ప్రారంభ సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రూ.4.8 కోట్లు, రన్నరప్ చెన్నయ్ రూ.2.4 కోట్లు అందుకున్నాయి. 2022లో ఐపీఎల్ ప్రైజ్‌మనీ భారీగా పెంచగా.. ప్రస్తుతం అదే కొనసాగుతోంది. ఐపీఎల్ ప్రైజ్‌మనీ మొత్తం రూ.46.5 కోట్లు. విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతోపాటు రూ.20 కోట్లు దక్కుతాయి. రన్నరప్ జట్టు రూ.12.5 కోట్లు అందుకుంటుంది. అలాగే, ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న మరో రెండు జట్లు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌కు కూడా భారీ మొత్తం అందుతాయి. క్వాలిఫయర్-2లో ఓడిన ముంబై రూ. 7 కోట్లు, ఎలిమినేటర్‌లో ఓడిన గుజరాత్ రూ.6.5 కోట్లు పొందుతాయి.
అలాగే, వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా కూడా అవార్డులు ఇవ్వనున్నారు. అత్యధిక రన్స్ చేసిన ఆటగాడు(ఆరెంజ్ క్యాప్), అత్యధిక వికెట్లు తీసిన బౌలర్(పర్పుల్ క్యాప్), అత్యధిక సిక్స్‌లు, అత్యధిక ఫోర్లు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, అల్టిమేట్ ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అంశాల్లో అవార్డులు ఇవ్వనున్నారు. ఈ అవార్డు గెలిచిన వారు రూ. 10 లక్షల చొప్పున అందుకోనున్నారు.






