- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2025 : చెన్నయ్‌కు వరుసగా నాలుగో ఓటమి.. పంజాబ్ సూపర్ విక్టరీ
IPL 2025 : చెన్నయ్‌కు వరుసగా నాలుగో ఓటమి.. పంజాబ్ సూపర్ విక్టరీ
by Harish |
ఐపీఎల్-18లో చెన్నయ్ సూపర్ కింగ్స్ ఓటమిపరంపర కొనసాగుతోంది.

X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో చెన్నయ్ సూపర్ కింగ్స్ ఓటమిపరంపర కొనసాగుతోంది. సీఎస్కే వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్‌పై 18 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. మొదట పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 స్కోరు చేసింది. యువ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య(103) మెరుపు సెంచరీతో కదం తొక్కాడు. అతనికితోడు శశాంక్ సింగ్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. జాన్సెన్(34 నాటౌట్) కూడా సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో చెన్నయ్ 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. కాన్వే(69), శివమ్ దూబె(42), రచిన్ రవీంద్ర(36), ధోనీ(27) పోరాడినా ఫలితం దక్కలేదు. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సీఎస్కేను నిలువరించి టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసింది.
Next Story






