- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL-2025: రీషెడ్యూల్‌పై కన్‌ఫ్యూజన్.. BCCI ఉపాధ్యక్షుడి కీలక ప్రకటన
వాయిదా వేయబడ్డ ఐపీఎల్ మ్యాచ్ లపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (BCCI Vice President Rajiv Shukla) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: వాయిదా వేయబడ్డ ఐపీఎల్ మ్యాచ్ లపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (BCCI Vice President Rajiv Shukla) కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. దీంతో పాకిస్థాన్ భారత సదిహద్దు రాష్ట్రాలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా.. భారత బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి. భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియాలో జరుగుతున్న ఐపీఎల్ 2025 (IPL 2025) మ్యాచ్ లను నిర్వాహకులు నిరవదికంగా వాయిదా (Postponed) వేశారు.
అయితే శనివారం జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణకై క్రికెట్ అభిమానుల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాయిదా వేసిన ఐపీఎల్ మ్యాచ్ ల షెడ్యూల్ (IPL schedule) ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ మ్యాచ్ ల పున ప్రారంభంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, బీసీసీఐ అధికారులు పరిస్థితిపై సమీక్ష చేస్తున్నారని ఆ తర్వాత తమ నిర్ణయాన్ని చెబుతారని తెలిపారు. అలాగే టోర్నమెంట్ ఒక వారం పాటు నిలిపివేయబడిందని, మొత్తానికి రద్దు చేయబడలేదని, ఫేక్ ప్రచారాలను నమ్మెద్దని సూచించారు. అంతేగాక శనివారం కాల్పుల విరమణ జరిగిందని, టోర్నమెంట్ త్వరలో పునఃప్రారంభించబడుతుంది అని రాజీవ్ శుక్లా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.






