IPL: రెచ్చిపోయి ఆడిన గుజరాత్‌ బ్యాటర్లు.. SRH ఎదుట భారీ టార్గెట్

by Gantepaka Srikanth |

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానం(Narendra Modi Stadium) వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్(Gujarat Titans) బ్యాటర్లు దంచికొట్టారు.

IPL: రెచ్చిపోయి ఆడిన గుజరాత్‌ బ్యాటర్లు.. SRH ఎదుట భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానం(Narendra Modi Stadium) వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్(Gujarat Titans) బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్లతో సహా టాప్ ఆర్డర్ మొత్తం అదరగొట్టారు. సాయి సుదర్శన్ (48), శుభ్‌మన్ గిల్ (76), జాస్ బట్లర్ (64), వాషింగ్టన్ సుందర్ (15) రాణించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. మొత్తంగా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేశారు. హైదరాబాద్ జట్లు విజయం సాధించాలంటే 225 పరుగులు చేయాల్సి ఉంది. SRH బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు, పాట్ కమ్మిన్స్, జీషన్ అన్సారీ తలో వికెట్ తీశారు. గిల్‌ను హర్షల్ పటేల్ రన్ అవుట్ చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.

Next Story