- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SRH vs MI: నిన్న మ్యాచ్ మధ్యలో ఇది గమనించారా?.. చూస్తే కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం
ప్రపంచ క్రికెట్లో కోతి చేష్టలు చేసే క్రికెటర్ ఎవరు? అని ఎవర్ని అడిగినా టక్కున విరాట్ కోహ్లీ అని చెబుతుంటారు. మ్యాచ్ ఎంత సీరియస్‌గా ఉన్నా.. తనదైన శైలిలో అందరినీ నవ్విస్తుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్లో కోతి చేష్టలు చేసే క్రికెటర్ ఎవరు? అని ఎవర్ని అడిగినా టక్కున విరాట్ కోహ్లీ అని చెబుతుంటారు. మ్యాచ్ ఎంత సీరియస్‌గా ఉన్నా.. తనదైన శైలిలో అందరినీ నవ్విస్తుంటారు. తాజాగా కోహ్లీలాగే మరో క్రికెటర్ తయారయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్ల మధ్య నిన్న హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం(Uppal Stadium) వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో మధ్యలో ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav).. పదే పదే అభిషేక్ శర్మ(Abhishek Sharma) జేబులు చెక్ చేయడం ఫన్నీగా మారింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి.. జేబులోంచి ఓ పేపర్ తీసి ఫ్యాన్స్ చూపించాడు అభిషేక్.. మళ్లీ ఏదైనా పేపర్ ముక్కను జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడేమో అని సరదాగా ప్యాంట్ మొత్తం చెక్ చేశాడు.
తాజాగా దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇన్నాళ్లు కోహ్లీనే అనుకున్నం.. నువ్వు కూడా ఇంత తీటోడివి ఏంటి స్కై బ్రో’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ముంబై ఛేదించింది. ముంబై స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేశారు. 46 బాల్స్ ఆడిన రోహిత్.. 70 పరుగులు చేశారు. ఇందులో మూడు సిక్సులు, ఎనిమిది ఫోర్లు బాదారు.
Surya bhai searching for slips in Abhishek’s pockets #srh #mumbai #mumbaiindians #sunrisers #surya #suryabhai #srh #SunrisersHyderabad #abhisheksharma #SRHvsMI pic.twitter.com/7nikPcYc0p
— Srikanth avasarala (@SrikanthAvasar2) April 23, 2025






