పాండ్యాతో విబేధాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో గిల్ పోస్టు

by Harish |

ఐపీఎల్-18లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు చేరుకున్న విషయం తెలిసిందే.

పాండ్యాతో విబేధాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో గిల్ పోస్టు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ చూసిన చాలా మంది గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మధ్య సఖ్యత లేదని అనుకున్నారు. దానికి కారణం ఇద్దరు ప్రవర్తించిన తీరే. ముందుగా టాస్ సమయంలో పాండ్యా షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించగా గిల్ చూడకుండా ముందుకు వెళ్లాడు. అలాగే, గిల్ అవుటైన సమయంలో పాండ్యా అతిగా సంబరాలు చేసుకున్నాడు. గిల్ వైపుగా అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు

. ఆ రెండు సందర్భాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో గిల్, పాండ్యా విబేధాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై గిల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. పాండ్యాతో విబేధాలు ఉన్నట్టు వచ్చిన వార్తలను ఖండించాడు. తమ మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదన్నాడు. ఇంటర్నెట్‌లో చూసే ప్రతి దాన్ని నమ్మొద్దన్నాడు. ఈ పోస్టుకు పాండ్యాను కూడా ట్యాగ్ చేశాడు. గిల్ స్పష్టతనివ్వడంతో పాండ్యాతో విబేధాలు కేవలం రూమర్లే అని తేలిపోయింది. ముంబై చేతిలో ఓటమితో గుజరాత్ ఐపీఎల్ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే.


Next Story