- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > టీం మీటింగ్ కు లేటుగా వచ్చాడంటూ.. వధెరకు మేనేజ్ మెంట్ వెరైటీ శిక్ష
టీం మీటింగ్ కు లేటుగా వచ్చాడంటూ.. వధెరకు మేనేజ్ మెంట్ వెరైటీ శిక్ష
ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ బ్యాటర్ నెహల్ వధెరకు ఆ జట్టు మేనేజ్‌మెంట్ వెరైటీ శిక్ష వేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ బ్యాటర్ నెహల్ వధెరకు ఆ జట్టు మేనేజ్‌మెంట్ వెరైటీ శిక్ష వేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడేందుకు గాను ముంబై నుంచి లక్నోకు వెళ్లే క్రమంలో టీం హోటల్ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ అతడు కాళ్లకు ప్యాడ్స్ కట్టుకుని వచ్చాడు. ఇదేదో ఫ్యాషన్ అనుకుంటే పొరపాటే. వధెర ఆలస్యానికి శిక్షగా ముంబై టీం మేనేజ్ మెంట్ వేసి శిక్ష..
అసలేం జరిగిందంటే..
లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఆడేందుకుగాను లక్నోకు పయనమయ్యేమేందు ముంబై టీం బ్యాటర్లతో ఓ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్‌కు వధెర ఆలస్యంగా వచ్చాడట. దీంతో టీమ్ హోటల్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే వరకు వధెర కాళ్లకు ప్యాడ్స్ కట్టుకోని రావాలంటూ శిక్ష వేసిందట. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Next Story






