ఐపీఎల్ లో ఒక్కసారి కూడా కప్ గెలవని జట్లు ఇవే..!

by Dishafeatures2 |
ఐపీఎల్ లో ఒక్కసారి కూడా కప్ గెలవని జట్లు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: 2007లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి బీసీసీఐ ప్రకటన చేసినప్పుడు చాలా మంది విమర్శలు చేశారు. టీ20 మ్యాచులను ఎవరు చూస్తారు అంటూ పెదవి విరిచారు. కానీ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ 2008లో మొదటిసారి నిర్వహించిన ఐపీఎల్ కు ఫ్యాన్స్ నుంచి విశేష ఆదరణ లభించింది. ఇక అప్పటినుంచి ఐపీఎల్ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 15 సీజన్లు పూర్తి కాగా 16వ సీజన్ (టాటా ఐపీఎల్ 2023) ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 15 టీమ్ లు ఐపీఎల్ లో ఆడాయి. అందులో 5 టీమ్ లు వైదొలగగా ప్రస్తుతం 10 టీమ్ లు ఆడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన 15 సీజన్లలో కొన్ని జట్లు ఒక్కోసారి, కొన్ని జట్లు రెండు కంటే ఎక్కువ సార్లు టైటిల్ ను కైవసం చేసుకున్నాయి. కానీ కొన్ని జట్లు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు.

ఇక ఆ జట్లు ఏవంటే..?


1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)

ఈ జట్టు ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉంటోంది. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు (6624) చేసిన కింగ్ కోహ్లీ ఆర్సీబీకి అత్యధిక కాలం కెప్టెన్ గా వ్యవహరించాడు. గత 15 సీజన్లకు ఆయన ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్నాడు. అంగట్లో అన్ని ఉన్నాయి.. కానీ అల్లుడి నోట్లో శని ఉందన్నట్లు జట్టులో గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. కానీ 2009, 2011, 2016 సీజన్లలో ఆర్సీబీ రన్నరప్ గా నిలించింది. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా ఈ జట్టుకు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇక ప్రస్తుతం ఆర్సీబీకి డుప్లెసిస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ సారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో ఆర్సీబీ ఉంది.


2. పంజాబ్ కింగ్స్( కింగ్స్ లెవెన్ పంజాబ్)

ఈ జట్టు కూడా ప్రారంభం నుంచి ఆడుతోంది. మొదటి సీజన్ లో సెమీస్ వరకు వెళ్లిన ఈ జట్టు తర్వాతి 5 సీజన్లలో దారుణంగా విఫలమైంది. ఇక 2014 ఫైనల్ వరకు వచ్చింది. ఫైనల్లో మాత్రం కోల్ కతా నైడ్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. ఇక 2015 నుంచి 2022 వరకు ఏదో ఆడుతున్నామంటే ఆడుతున్నామన్నట్లుగానే ఈ జట్టు ప్రదర్శన ఉంది. ప్రస్తుతం శిఖర్ ధావన్ కెప్టెన్ గా ఉన్న పంజాబ్ కింగ్స్.. ఈసారి ఎలాగైనా కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది.


3. ఢిల్లీ క్యాపిటల్స్ (పాత ఢిల్లీ డేర్ డెవిల్స్)

జీఎంఆర్, జేఎస్డబ్ల్యూ గ్రూపులు సంయక్తంగా ఓనర్ గా ఉన్న ఈ టీమ్ కూడా 2008 నుంచి ఐపీఎల్ లో ఆడుతోంది. అయితే ఈ జట్టు మొదట్లో కొన్ని సీజన్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్ గా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ జట్టు పేరును ఢిల్లీ క్యాపిటల్స్ గా మార్చారు. ఇక 2008, 2009 సీజన్లలో సెమీస్ వెళ్లిన ఢిల్లీ డేర్ డెవిల్స్.. అనంతరం 2012, 2019, 2021లో ప్లేఆఫ్ దశకు చేరుకోగా.. 2020లో ఢిల్లీ చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలించింది. ఇక మిగిలిన అన్ని దశల్లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా ఉన్న ఈ జట్టు.. ఈ సారి కప్ కొట్టాలనే దృఢసంకల్పంతో ఉంది.

కాగా ప్రస్తుత టాటా ఐపీఎల్ లో ఆడుతున్న పది జట్లలో పై మూడు టీమ్ లు కాకుండా ముంబై ఇండియన్స్ 5 సార్లు, సీఎస్కే 4 సార్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ (దక్కన్ చార్జర్స్ తో కలిపి) 2 సార్లు, కేకేఆర్ 2 సార్లు టైటిల్ ను కైవసం చేసుకోగా.. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ చెరో టైటిల్ సాధించాయి. ఇక గతేడాది ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ఇంకా ఖాతా తెరవలేదు.



Next Story

Most Viewed