- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > RCB vs LSG IPL 2023 : దంచికొట్టిన ఆర్సీబీ.. లక్నో టార్గెట్ 213
RCB vs LSG IPL 2023 : దంచికొట్టిన ఆర్సీబీ.. లక్నో టార్గెట్ 213
టాటా ఐపీఎల్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ పరుగుల వరద పారించింది.

X
దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ పరుగుల వరద పారించింది. కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో ఆర్సీబీ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.
హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్లు
ఆర్సీబీ బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ముందుగా ఓపెనరగ్ గా వచ్చిన కోహ్లీ 3 సిక్కర్లు.. 4 ఫోర్లతో 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మరో ఓపెనర్ డుప్లెసిస్ కూడా 35 బాల్స్ లోనే అర్ధ సెంచరీ చేశాడు. కోహ్లీ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ కేవలం 24 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఎల్ఎస్జీ బౌలర్లను ఊచకోత కోశాడు.
Next Story






