IPL 2023: రాజస్థాన్‌ కెప్టెన్‌కు జరిమానా..

by Vinod kumar |

ఉత్కంఠ పోరులో చెన్నయ్‌పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్‌‌కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు.

IPL 2023: రాజస్థాన్‌ కెప్టెన్‌కు జరిమానా..
X

చెన్నయ్: ఉత్కంఠ పోరులో చెన్నయ్‌పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్‌‌కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. బుధవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ. 12 లక్షల జరిమానా పడింది. నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటాను రాజస్థాన్ పూర్తి చేయలేకపోయింది.

ఒక్క ఓవర్‌ తక్కువగా వేసింది. దాంతో ఈ సీజన్‌లో రాజస్థాన్ తొలి తప్పిదంగా భావిస్తూ మ్యాచ్ రిఫరీ జరిమానాతో సరిపెట్టాడు. కాగా, చెన్నయ్‌తో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Next Story