ఉత్కంఠ పోరులో KKR విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం

by Kodari Anjali |

ఐపీఎల్‌లో 53వ మ్యాచ్ KKR vs PBKS మధ్య ఉత్కంఠగా సాగింది. చివరి బంతివరకు వచ్చిన ఈ మ్యాచ్ లో కోల్‌కతా జట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది.

ఉత్కంఠ పోరులో KKR విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో 53వ మ్యాచ్ KKR vs PBKS మధ్య ఉత్కంఠగా సాగింది. చివరి బంతివరకు వచ్చిన ఈ మ్యాచ్ లో కోల్‌కతా జట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో పంజాబ్ బ్యాటర్లు శిఖర్ ధావన్ 57, జితేశ్ శర్మ 21, షారుఖ్ ఖాన్ 21, రిషి ధావన్ 19, రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన KKR జట్టు.. ఓపెనర్ రాయ్ 38, కెప్టెన్ రాణా 51, రసూల్ 42, రింకు సింగ్ 21 పరుగులతో రాణించారు. 19.5 బంతికి రసూల్ రన్ అవుట్ కావడంతో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ గా మారింది. దీంతో చివరి బంతి రెండు పరుగుల కావాల్సి ఉండగా.. రింకు సింగ్ ఫోర్ కొట్టాడు. దీంతో KKR 182 పరుగులు చేసి విజయం సాధించింది. అలాగే ప్లే ఆఫ్ రేసులో తాము ఇంకా ఉన్నామని నిరూపించుకుంది.

Next Story