- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2023: యశస్వి జైస్వాల్ విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ
IPL 2023లో భాగంగా కోల్‌కతాలో జరుగుతున్న మ్యాచ్‌లో యువ సంచలనం యశస్వి జైస్వాల్వీర విహారం చేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కోల్‌కతాలో జరుగుతున్న మ్యాచ్‌లో యువ సంచలనం యశస్వి జైస్వాల్వీర విహారం చేశాడు. రాజస్థాన్ యంగ్ ప్లేయర్ యశస్వి ఇండియన్ ప్రీమియర్‌లీగ్ చరిత్రలోనే అత్యంత వేగంగా అర్ధ సెంచరీ బాది.. సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకుని రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డును అధిగమించాడు.
13 బంతుల్లోనే జైస్వాల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్న జైశ్వాల్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.. అయితే ఓవరాల్‌గా టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 12 బంతుల్లోనే యువరాజ్ ఈ ఫీట్ సాధించగా.. ఇప్పుడు యువరాజ్ తర్వాత జైస్వాల్ రెండో స్థానంలో నిలిచాడు. 2007 టి20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ పై యువీ 12 బాల్స్‌లోనే ఫిఫ్టీ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదిన రికార్డు కూడా ఉంది.






