IPL 2023: టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..

by Disha Web Desk 13 |
IPL 2023: టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.

కోల్‌కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ.. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. మరోవైపు వరుస పరాజయాలతో పూర్తిగా చతికిలపడిన కేకేఆర్.. ఆర్‌సీబీని ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది. ప్రస్తుతం ఆర్సీబీ 8 పాయింట్లతో టేబుల్‌లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. దాంతో ఈ మ్యాచ్ కూడా ఫ్యాన్స్‌కు కావాల్సిన మజాను అందించనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

ఎన్ జగదీసన్ (w), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (సి), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, వైభవ్ అరోరా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లీ(సి), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(w), సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, విజయ్‌కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్


Next Story