IPL 2023: టాస్ గెలిచిన RCB.. తొలి మ్యాచ్‌కు స్టార్ ఆల్ రౌండర్ దూరం

by Disha Web Desk 19 |
IPL 2023: టాస్ గెలిచిన RCB.. తొలి మ్యాచ్‌కు స్టార్ ఆల్ రౌండర్ దూరం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఐపీఎల్‌లోనే మోస్ట్ పాపులర్ జట్లైనా బెంగుళూరు, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. మరి కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ వైపు.. స్టార్ బ్యాటర్ కోహ్లీ మరోవైపు ఉండటంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక, ఆర్సీబీకి గత సీజన్‌లో అద్భుత విజయాలు అందించిన ఆల్ రౌండర్ వనిరుదు హసరంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక, కోహ్లీ, రోహిత్ అభిమానులు భారీగా చేరుకుని స్టేడియం వద్ద సందడి చేస్తున్నారు.

ఇరు జట్ల వివరాలు:

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (w), కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్




Next Story

Most Viewed