IPL 2023: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..

by Disha Web Desk 13 |
IPL 2023: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది. అదే సమయంలో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఎదుర్కోనుంది. మరి లక్నో, ముంబైలలో ఇంటికి వెళ్లేదెవరు.. క్వాలిఫయర్‌-2కు చేరుకునేదెవరు తేలనుంది. ఇరుజట్లు గతంలో తలపడిన మూడు సందర్భాల్లోనూ లక్నో సూపర్‌ జెయింట్స్‌నే విజయం వరించింది.

ఈ ఎలిమినేటర్ రోహిత్ శర్మకు లైఫ్ అండ్ డెత్ గేమ్‌గా మారింది. వరుసగా రెండు సీజన్ల ప్లేఆఫ్స్‌కు దూరమైంది ముంబై ఇండియన్స్. 2021, 2022 సీజన్లల్లో లీగ్ దశలోనే ఆ జట్టు ప్రస్థానం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో కూడా చివరి నిమిషంలో తన బెర్త్‌ను కన్‌ఫర్మ్ చేసుకోగలిగింది. క్లిష్ట పరిస్థితులను అధిగమించి ప్లేఆఫ్స్‌లోకి చేరిన రోహిత్ సేన- ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఐపీఎల్ 2023 సీజన్ తొలి ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్-మరోసారి ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఈ ఘనతను సాధించడం ఇది పదోసారి. 2021 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై ఈ నెల 28వ తేదీన ఫైనల్స్ ఆడబోతోంది. ధోనీ సేనను ఢీ కొట్టే జట్టు ఏదనేది ఇంకా తేలాల్సి ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

ఆయుష్ బడోని, దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(w), కృనాల్ పాండ్యా(c), కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్

Next Story